అది గుర్రమే కానీ.. దానికి డబుల్ కాట్ బెడ్, దిండు, దుప్పటి..

జంతువులంటే ఎంత ప్రేమో ఇది చూస్తే తెలుస్తుంది. ఓ మహిళ గుర్రాన్ని పెంచుకుంటుంది. ఇంట్లో ఆవరణలోనే దానికో చిన్న గది ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. డబుల్ కాట్ బెడ్, తిండ్లు, దుప్పట్లు అన్ని ఏర్పాటు చేసింది. ఇంట్లో ఆ మహిళ ఎలా అయితే నిద్రపోతుందో.. ఎలాంటి వసతులు ఏర్పాటు చేసుకుంటుందో.. సరిగ్గా అలాగే తాను ముద్దుగా.. ముచ్చటగా పెంచుకుంటున్న గుర్రానికి కూడా ఏర్పాటు చేసింది..దీనికి సంబందించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ట్విట్టర్‌లో ఓ మహిళ తన గుర్రాన్ని నిద్రించడానికి పడుకోబెట్టే వీడియోను షేర్ చేసింది. సాధారణంగా, గుర్రాలను లాయంలో ఉంచుతారు. గుర్రాలు నిలబడి నిద్రపోతాయి. కానీ ఈ మహిళ తన పెంపుడు జంతువైన గుర్రాన్ని  సౌకర్యవంతమైన మంచం మీద పడుకోబెట్టి, ఆపై పెద్ద దుప్పటితో కప్పి, దాని తలను దిండుపై ఉంచుతుంది. త్వరగా నిద్రపోవాలని .. పసి పిల్లలను జోకొట్టినట్లు గుర్రం తలపై నెమరుతున్న దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ట్వీట్ తో పాటు గుర్రాన్ని ఎలా నిద్ర పోనివ్వాలి అని రాసింది. 

ఈ వీడియో ఇప్పటివరకు 8మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది. చాలామంది నెటిజన్లు తమ కామెంట్లతో ముంచెత్తారు. ‘‘గుర్రం ఇలా సౌకర్యవంతంగా నిద్రపోవడం నేనెప్పుడూ చూడలేదంటూ ’’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా..‘‘ఇది స్వచ్ఛమైన ప్రేమ.. విశ్వాసం.. జంతువులతో ఇంత బలమైన బంధాన్ని కలిగివున్న వ్యక్తిని చూడటం చాలా అనందంగా ఉంది ’’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. 

కాగా.. గతంలో గుర్రం పడుకుని గడ్డి తింటున్న క్లిప్ వైరల్ అయింది. గుర్రం కళ్లు మూసుకొని కాళ్లు చాచి, దవడలు కదుపుతూ గడ్డితో మెలికలు తిరుగుతూ అది కనిపిస్తుండటం నెటిజన్లను ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ యింది.