లోకల్ రైల్లో కీచకులు.. ఆడోళ్లు కనిపిస్తే వదలటం లేదు..

లోకల్ రైల్లో కీచకులు ఎక్కువయ్యారు.. ఆడోళ్లు కనిపిస్తే చాలు వదలటం లేదు.  తాజాగా ముంబైలో ఓ 24 ఏళ్ల మహిళను లోకల్ రైల్లో గుర్తు తెలియని వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ ఘటన 2023 జూన్ 23 చోటుచేసుకుంది. అయితే  అ మహిళ సంఘటన జరిగిన ఐదు రోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబయి సెంట్రల్ రైల్వే పోలీసులు నిందితుడిపై ఐపీసీ 354-A (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు.

2023 జూన్ 23 శుక్రవారం రోజున ఓ మహిళ చర్చ్ గేట్‌కు వెళ్లే రైలు ఎక్కింది. గ్రాంట్ రోడ్ స్టేషనుకు రైలు చేరుకునే ముందు ఓ ఆగంతకుడు తనను లైంగికంగా వేధించాడని,  అసభ్యంగా సంజ్ఞలు చేశాడని,  రైలు దిగే ముందు అసభ్య పదజాలంతో మాట్లాడాడని తన  ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు  విచారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇలాంటి ఘటన లోకల్ రైల్లో జరగడం మొదటిది ఏం కాదు. 2023 జూన్  14న 20 ఏళ్ల ఓ యవతి ముంబై లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆ యవతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  విద్యార్థిని ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.