Love Reddy: ప్రేమికుల‌ను విడదీస్తావా.. నీయవ్వ: న‌టుడిని చిత‌క‌బాదిన మ‌హిళ

Love Reddy: ప్రేమికుల‌ను విడదీస్తావా.. నీయవ్వ: న‌టుడిని చిత‌క‌బాదిన మ‌హిళ

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం.. వాళ్ల పెళ్లికి పెళ్లికి పెద్దలు కాదనడం.. ఇలాంటి కథలు ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏదో మంచి మనసున్న డైరెక్టర్లైతే ప్రేమికుల‌ను కలిపి వచ్చిన ప్రేక్షకులను సంతోష పరుస్తాడు. కాదు, కూడదు వైవిధ్యంగా సినిమా ఉండాలనే ఆలోచన ఉన్నవారైతే, ఎవరో ఒకరి క్యారెక్టర్‌ని చంపేస్తారు. ఇలాంటి ఎమోషనల్ కథలతో తమను బాధపెడతార్రా..! అంటూ ఓ ప్రేక్షక మహిళ నటుడిని చితకబాదింది. ఈ ఘటన గురువారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.  

యువ నటీన‌టులు అంజన్‌ రామచంద్ర, శ్రావణి జంటగా నటించిన చిత్రం లవ్‌రెడ్డ’. ఇటీవల విడుదలైంది. చిన్న సినిమా అయినప్పటికీ, పెద్ద హీరోలు మూవీలు ఏవీ లేకపోవడంతో ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ రెస్పాన్స్ చూసి చిత్రబృందం  గురువారం హైదరాబాద్‌లోని పలు థియేటర్లను సంద‌ర్శించింది. ఈ క్రమంలో చిత్ర‌యూనిట్‌కు ఒక చేదు అనుభ‌వం ఎదురైంది. 

ప్రేమికుల‌ను విడదీస్తావా.. నీ అవ్వ

నిజాంపేట జీపీఆర్ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో చిత్ర‌యూనిట్‌పై ఓ ప్రేక్షక మహిళ దాడి చేసింది. మూవీ అయిపోయాక ఎలా ఉందంటూ చిత్ర‌యూనిట్ ప్రేక్ష‌కుల‌ను అడుగుతుండ‌గా.. సినిమాలో ల‌వ్ రెడ్డి తండ్రి పాత్ర‌లో న‌టించిన ఎన్టీ రామస్వామిపై ఒక మ‌హిళ దాడి చేసింది. సినిమా చూసి ఎమోష‌న‌లైన ఆమె.. 'ప్రేమికుల‌ను విడదీస్తావా? నీ సంగతి చెప్తా ఉండు..' అంటూ రామస్వామిని ఎడాపెడా వాయించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలావుంటే ఈ ఘ‌ట‌న ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సినిమాపై హైప్ తెచ్చేందుకు ఇలా చేసుంటారని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ | Kannappa: కన్నప్ప కోసం.. 12 జ్యోతిర్లింగాల ప్రయాణం.. కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు