పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన మృత్యువు.. నాగర్ కర్నూలు జిల్లాలో మహిళ స్పాట్ డెడ్

పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన మృత్యువు.. నాగర్ కర్నూలు జిల్లాలో మహిళ స్పాట్ డెడ్

కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొని సరిగ్గా ఒక రోజు కూడా పూర్తి కాలేదు. కుటుంబ సభ్యులతో సరదాగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే ఓ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.  అందరూ ఆనందంగా గడుపుతున్న వేళ నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూర్ గ్రామంలో విషాదం నెలకొంది. పెద్ద ముద్దునూరులో నాగర్ కర్నూలు - శ్రీశైలం రహదారిపై కారు  అతివేగంగా దూసుకొచ్చి అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే  మృతి చెందింది. 

అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు  రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ అనే మహిళ(45)ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి దాకా ఖాళీగా ఉన్న రోడ్డుపై మెరుపు వేగంతో ఉన్నట్లుండి కారు పల్టీలు కొడుతూ వచ్చి ఢీ కొట్టడంతో క్షణకాలంలోనే మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 

ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.