నర్సంపేట, వెలుగు : తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని, స్థలాన్ని ఇప్పించాలంటూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటలోని అంబేద్కర్ విగ్రహం శుక్రవారం ఎదుట ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త, మాజీ మావోయిస్ట్ సోలం యాదగిరి లొంగింపోయిన టైంలో పట్టణంలోని సుద్దబొంద వద్ద ప్రభుత్వం 80 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించిందని చెప్పారు.
తన భూమి పక్కన ఉన్న గవర్నమెంట్ టీచర్ పూజారి రవి తన స్థలాన్ని కబ్జా చేసి, బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులతో పాటు, ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై చరణ్‌రాజ్ అక్కడికి వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు.