బంగారం కొనేందుకు కస్టమర్ లాగా జువెలరీ షాప్ కు వెళ్లిన ఓ మహిళా చేసిన పనికి.. షాప్ యాజమాన్యం ఖంగు తిన్నారు. ఆ మహిళ షాపు నుంచి తిరిగి వెళ్లిపోయిన తర్వాత తెలిసింది అసలు సంగతి. డిసెంబర్ 6వ తేదీ బుధవారం హైదరాబాద్ హబ్సిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ దుకాణంలో ఆభరణాలు కొనేందుకు వచ్చిన ఓ మాయ లేడీ.. షాపు మొత్తం కలియతిరిగి.. ఎవరి పనుల్లో వారు ఉండటాన్ని గమనించి.. తన వెంట తెచ్చిన నకిలీ నగలను పెట్టి.. ఒరిజినల్ నగలు అపహారించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.
కొద్దిసేపటి తర్వాత దుకాణంలో పని చేస్తున్న ఉద్యోగులు గుర్తించి.. యజమానికి సమాచారం అందించారు. వెంటనే యజమాని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. జువెలరీ షాప్ లో ఉన్న సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు.. ఆ మాయ లేడిని అరెస్ట్ చేశారు.