మగవాళ్లే ఇంట్లో కూర్చుంటే.. అమ్మాయిలు సేఫ్: మహిళ వీడియో వైరల్

మగవాళ్లే ఇంట్లో కూర్చుంటే.. అమ్మాయిలు సేఫ్: మహిళ వీడియో వైరల్

ఓ వైపు అత్యాచారాలు జరుగుతుంటే బాధిత మహిళలే తప్పు చేసినట్లు వాళ్లకే సూచనలు, సలహాలు ఏంటంటూ ఓ మహిళ అసహనం వ్యక్తం చేసింది. నేరాలకు మూలాన్ని అరికట్టాలంటూ నినదించింది. మగవాళ్లు ఇంట్లో కూర్చుంటే అమ్మాయిలు స్వేచ్ఛగా ఉంటారని, రేప్‌లు కూడా జరగవని చెప్పింది. నటాషా అనే మహిళ ట్విట్టర్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

‘అత్యాచారాలు జరగడానికి కారణం ఎవరు? మగవాళ్లే కదా. మరి సాయంత్రం 7 గంటల కల్లా మహిళలు ఇంటికెళ్లిపోవాలని, పోలీసులు భద్రత కల్పిస్తారని మాటలు ఎందుకు? మమ్మల్ని ఎవరూ రక్షించక్కర్లేదు. అన్నదమ్ములో, పోలీసులో ప్రొటెక్షన్ ఇవ్వక్కర్లేదు. అసలు ఈ సమస్య వస్తోందే మగవాళ్ల వల్ల అయినప్పుడు మహిళలకు సలహాలు, సూచనలెందుకు? ఆలోచనా తీరులో మార్పు రావాలి. మగవాళ్లే సాయంత్రం 7 గంటల కల్లా ఇంట్లో గడిపెట్టుకుని కూర్చుంటే సరిపోతుంది. మేం స్వేచ్ఛగా ఉంటాం’ అని ఆమె ఆ వీడియోలో చెబుతోంది. ఆమె అభిప్రాయం కరెక్ట్ అంటూ ట్విట్టర్లో చాలా మంది మద్దతిస్తున్నారు. వేల మంది లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు.

MORE NEWS:

మానవ హక్కుల కమిషన్‌కు సమాధానం చెబుతాం: సజ్జనార్

మహిళను భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి