ప్రియుడిని పెళ్లి చేసుకొనేందుకు బంగ్లాదేశ్ యువతి సాహసం

ప్రియుడిని పెళ్లి చేసుకొనేందుకు బంగ్లాదేశ్ యువతి సాహసం

సోషల్ మీడియాలో చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. వేరే దేశాల్లో నివాసం ఉంటున్న యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. మనస్సిచ్చిన వాడిని పెళ్లి చేసుకొనేందుకు ఆ యువతి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా దేశ సరిహద్దులు దాటేసింది. చిట్టడివి దాటి.. నదిలో ఈత కొడుతూ.. భారతదేశానికి చేరుకుంది. అనంతరం ప్రియుడిని కలుసుకుంది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ అక్రమ మార్గంలో వచ్చినందుకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. భారతదేశంలో నివాసం ఉండే అభిక్ మండల్ తో బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతి మధ్య ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భారత్ కు రావాలని అనుకుంది. కానీ.. ఆమెకు పాస్ పోర్టు లేకపోవడంతో ప్రియుడిని కలవలేకపోయింది. ఎలాగైనా కలుసుకుని పెళ్లి చేసుకోవాలని యువతి నిర్ణయించుకుంది. బయటకు వచ్చింది. యువతి రాయల్ బెంగాల్ టైగర్స్ కు పేరొందిన సుందర్ బన్స్ లోకి యువతి ప్రవేశించిందని, అనంతరం అక్కడున్న నదిలో గంటపాటు ఈదుకుంటూ.. గమ్యస్థానానికి చేరుకుందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల కింద కోల్ కతాలోని కాళీఘాట్ ఆలయంలో ప్రియుడిని పెళ్లి చేసుకుందన్నారు. కానీ.. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిందనే కారణంతో ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బంగ్లాదేశ్ హై కమిషన్ కు అప్పగిస్తారని సమాచారం. అలాగే.. చాక్లెట్ కొనుక్కోవడానికి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం : -

తెలంగాణలో అధికారం మారుతుంది 


కోల్కత్తాలో 10 నిమిషాల్లో లిక్కర్ డెలివరీ