మనం పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు సమీపంలో పవిత్ర నదుల్లో లేదా పవిత్ర నీటిగుండాలు లేదా బావుల్లో కాయిన్ వేసి కోరికలు తీర్చమని ప్రార్థిస్తాం.. కానీ ఓ అమ్మాయి వెరైటీగా ఏటీఎం కార్డు స్వైప్ చేసింది. ఈ వింతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తలోకి వచ్చింది. వివరాలేంటో తెలుసుకుందాం..
ఎక్కడ, ఎఫ్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. పోస్ట్ చేసిన వెంటనే 22 వేల మంది చూశారు.. లైకులు కొట్టతారు. ఈ వింత వీడియోలో ఆ ఆమ్మాయి పవిత్ర నీటి గుండంలో కాయిన్ వేయాల్సింది బదులుగా.. ఏటీఎం కార్డు స్వైప్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంత సేపు కలవర పాటుకు గురైనా.. కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇక ఆచారాలు, నమ్మకాలు గల చాలా మంది మాత్రం ఇదేం పద్దతి.. చక్కగా ఏ రూపాయి బిల్లో.. ఐదు రూపాయల బిల్లో వేసి కోరికలు కోరుకుంటే పుణ్యం వస్తుంది కదా అని సలహాలు ఇస్తున్నారు.
QR కోడ్ స్కానింగ్ , కార్డు చెల్లింపులు ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న క్రమంలో దేశంలోని కొన్ని పవిత్ర స్థలాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం, ఒడిశాలోని జగన్నాత్ ఆలయం వంటి అనేక పవిత్ర స్థలాలు డిజిటల్ చెల్లింపులను అనుమతించడంతో భక్తులు నగదు రహిత విరాళాలు ఇస్తున్నారట. అందుకే అనుకుంటా.. ఈ అమ్మాయి కూడా పవిత్ర గుండం నీటిలో ఏటీఎం కార్డును స్వైప్ చేసింది. దేవుడు అనుగ్రహించి ఆమె కోరికలు తీర్చాలని కోరుకుందాం..