నీ నిజాయితీకి నిజంగా దండం పెట్టాలి తల్లీ : తన గొర్రె పిల్లకు రైలు టికెట్ తీసుకుంది

రైళ్లో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. చాలా మంది టికెట్ తీసుకుంటారు. కొందరు మాత్రం ఆ...ఏమవుతుందిలే..అనుకుని టికెట్ తీసుకోకుండా రైళు ఎక్కుతారు.  టీసీ(టికెట్ కలెక్టర్) వస్తే చూసుకుందాం లే ..అని అనుకుంటారు. దీంతో నిత్యం వందల సంఖ్యలో జనం టికెట్ లేకుండానే తమ గమ్యస్థానాల్లో దిగిపోతుంటారు. అయితే రైళ్లలో మనుషులకే టికెట్ తీసుకోని ఈ రోజుల్లో..ఓ అవ్వ..తన పెంపుడు జంతువులకు కూడా టికెట్ తీసుకుని తన నిజాయితీని నిరూపించుకుంది. 

ఓ మహిళ తన పెంపుడు రెండు మేకలతో రైలు ఎక్కింది. కొద్దిదూరం ప్రయాణించాక.. టీసీ (టికెట్ కలెక్టర్ ) వచ్చిన ఆ మహిళను టికెట్ అడిగాడు.  మహిళ టికెట్ కలెక్టర్ కు టికెట్ చూపించింది. టికెట్ ను చూసిన టీసీ..ఒక్కసారిగా నవ్వాడు. ఎందుకు నవ్వాడంటే..

మహిళ ..టీసీకి ఇచ్చిన టికెట్లో ముగ్గురికి టికెట్ తీసుకున్నట్లు ఉంది. టీసీ ఆమెను ప్రశ్నించాడు. ముగ్గురు ఎవరెవరూ అని అడిగాడు. దానికి సమాధానంగా ..తనతో పాటు..తన రెండు మేకలకు కూడా టికెట్ తీసుకున్నట్లు మహిళ తెలిపింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 

నిజాయితీకి హ్యాట్సాఫ్..

మేకలకు కూడా టికెట్ తీసుకున్న మహిళపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి వ్యక్తులు దేశానికి గర్వ కారణమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సింపుల్ హానెస్ట్ ఇండియన్ అని పోస్ట్ చేశాడు. అతుల్ అనే ట్విట్టర్ యూజర్ 'మేక ఆ మహిళకు జంతువు మాత్రమే కాదు. అది ఆమె కుటుంబంలో భాగం, ఎవరైనా కుటుంబ సభ్యులతో ఇలాగే ప్రవర్తిస్తారు..అని కామెంట్ చేశాడు. దేశంలో  ధనవంతులు దోచుకుని పారిపోతారు, పేదలు మేకలకు కూడా టిక్కెట్లు కొని ప్రయాణం చేస్తారు' అని మరొకరు రాశారు.