ఈ మధ్యకాలంలో కొందరు కోపం, ప్రతీకారం వంటివాటి కారణంగా ఇతరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా ఓ యువకుడు ఇతర సామజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఏకంగా యువకుడి తల్లికి మతిస్థిమితం లేని యువకుడితో పెళ్లి చేసేందుకు యువతి బంధువులు యత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుని.
ALSO READ | పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 3 లక్షలు : అమ్మాయిల రచ్చతో సర్కార్ షేక్
పూర్తివివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకి చెందిన పెద్దకడబూరు మండలం కలుకుంటలో గోవిందమ్మ అనే మహిళ తన కుమారుడితో కలసినివాసం ఉంటోంది. అయితే గోవిందమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. దీంతో గ్రామంలో దొరికే చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది.
కాగా 6 నెలల క్రితం గోవిందమ్మ కుమారుడు అదే గ్రామంలోని ఇతర సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన కుటుంబాన్ని తీసుకుని గ్రామం వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. కాగా ఇటీవలే గోవిందమ్మ పని నిమిత్తమై కలుకుంట గ్రామానికి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మరియు బంధువులు కలసి గోవిందమ్మని బంధించి చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురిచేసారు. అంతేగాకుండా మతిస్థిమితం లేని ఓ వ్యక్తితో గోవిందమ్మ పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన కొందరు స్థానికులు దగ్గరలోని పోలీసులకి సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని గోవిందమ్మని కాపాడారు.