గ్రేట్ కదా.. ఆసుపత్రి నుంచి స్ట్రెచర్‌పై వచ్చి ఓటేసింది

దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి.  బెంగళూరులో ఓ 78 ఏళ్ల మహిళ ఆసుపత్రి నుంచి స్ట్రెచర్‌పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది.  న్యుమోనియాతో బాధపడుతున్న కళావతి  అనే మహిళ ఇటీవల ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆసుపత్రిలో చేరినప్పుడు ఆక్సిజన్ లెవల్ 80 శాతానికి పడిపోయాయి. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో నార్మల్ వార్డ్ కు తరలించారు.  

అయితే ఆసుపత్రిలో  కోలుకుంటున్న సమయంలో కళావతి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయాన్ని గౌరవించిన  ఆసుపత్రి బృందం ఆమె ఓటు వేసేందకు ఏర్పాట్లు చేసింది. ఆమెను అంబుల్సెన్ లో  జయనగర్ పోలింగ్ స్టేషన్‌కు చేర్చింది. అనంతరం  ఆమె స్ట్రెచర్‌పై ఉంటూనే  ఓటు వేసింది. 

Also Read:పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?

మరోవైపు రెండోదశ పోలింగ్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఈరోజు  ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలుండగా 14 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.