జిమ్​ లో విషాదం.. ట్రేడ్​ మిల్​పై నడుస్తూ యువతి మృతి

జిమ్​ లో విషాదం.. ట్రేడ్​ మిల్​పై నడుస్తూ యువతి మృతి

చాలా స్లిమ్​ గా ఉండాలని.. అందంగా నాజుగ్గా శరీరం ఉండేందుకు జనాలు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు.  ఇక బరువు తగ్గేందుకు కొంతమంది డైటింగ్​.. వాకింగ్​ చేస్తే.. మరికొంతమంది జిమ్​ కు వెళ్లి వ్యాయామం చేస్తుంటారు.  ఇలా జిమ్​ సెంటర్​ లో ట్రేడ్​ మిల్​ పై వాకింగ్​ చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కంప్యూటర్​ యుగంలో మనం తినే ఫుడ్​ అంతా దాదాపు కల్తీ ఆహారమే. దీంతో   దీంతో బరువు పెరగడం, ఊబకాయం ఇలా అనేక రకాల ఆరోగ్య  సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  బరువు తగ్గేందుకు చాలామంది యోగా.. ఆసనాలు వేస్తున్నారు. మరికొందరు యువత జిమ్​కు వెళ్లి వ్యాయామం చేస్తూ  కసరత్తులు చేస్తున్నారు. 

 

బరువు తగ్గాలని జిమ్ ల వెంట పరిగెడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు బాడీ పెంచుకోవడం.. తరువాత  జిమ్ లకు వెళ్లి  బరువు తగ్గడం వంటి పనులు చేస్తున్నారు. అయితే ఇప్పడు ఓ  జిమ్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మూడవ అంతస్తులోని కిటికీకి సమీపంలో అమర్చిన ట్రెడ్‌మిల్‌పై 22 ఏళ్ల అమ్మాయి నడుస్తోంది. అయితే అక్కడ ఒక్కసారిగా ఏమైందో తెలీదు. యువతి హఠాత్తున కిటికీ నుంచి బయటపడింది. అయితే ట్రెడ్ మిల్ పై నడుస్తున్న యువతి ఉన్నట్టుండి తన వెనకాలే ఉన్న కిటీకీలోంచి బయటపడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఇక్కడ జిమ్‌లోని మూడవ అంతస్తులో ఉన్న మహిళ ట్రెడ్‌మిల్ నుండి జారిపడి కిటికీలోంచి పడిపోవడంతో  మరణించింది. 22 ఏళ్ల అమ్మాయి తన ముఖాన్ని టవల్‌తో తుడవడానికి ముందు ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. దీని తర్వాత వెంటనే ఆమె తన బ్యాలెన్స్ కోల్పోవడంతో వెనుక ఉన్న ఓపెన్ విండో నుండి బయటకు పడిపోయింది. వీడియోలో, అమ్మాయి పడిపోకుండా ఉండటానికి విండో ఫ్రేమ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చివరకు ఫలితం లేకుండా పోయింది. కింద పడిన యువతి తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించిందని తెలిపారు.

యువతి తలపై అనేక గాయాలు ఉన్నాయని పోస్టుమార్టంలో తేలింది.ఆమె పడిపోయిన ట్రెడ్‌మిల్ మరియు కిటికీ మధ్య దూరం కేవలం 60 సెంటీమీటర్లు మాత్రమేనని దర్యాప్తులో తేలింది. కిటికీ దగ్గర ట్రెడ్‌మిల్ ఉంచడం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. పాంటియానాక్ పోలీస్ కమీషనర్ ఆంటోనియస్ ట్రయాస్ కుంకురోజాతి మాట్లాడుతూ, ‘ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా బ్యాలెన్స్ కోల్పోయి, ఆపై కిటికీలోంచి పడటం చాలా సులభం.’ అని అన్నారు. కాగా, ఈ ఘటన తర్వాత మూడు రోజుల పాటు జిమ్ ను అధికారులు సీజ్​ చేశారు.