మనం వంటలు చేసేటప్పుడు కట్ చేసుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కూరగాయలు అన్ని కట్ చేసుకోవడం, పచ్చిమిర్చి, వెల్లుల్లి సైతం మొత్తం అన్నిటినీ కట్ చేసుకుని పెట్టుకోవడం చాలా టైం తీసుకుంటుంది కదా...! ముఖ్యంగా వెల్లుల్లి పై తొక్క తీయడం అంటే సమయం ఎక్కువ తీసుకుంటుంది. కొత్త టెక్నిక్ ను ఉపయోగించి త్వరగా.. తేలిగ్గా వెల్లులంలి పొట్టు తీయవచ్చు.
ఇది నిజమండి. దీనిలో ఏ సందేహం లేదు పైగా పెద్ద కష్టము కాదు. ఎంతో ఈజీగా మీరు కూడా చేయొచ్చు. అయితే అది ఎలాగా అనుకుంటున్నారా..? మరి ఇంకేమీ ఆలస్యం చేయకుండా దానిని చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నం చేయండి. దీంతో మీరు ఎంతో సులువుగా వెల్లుల్లిని కట్ చేసుకోవచ్చు. అలాగే తొక్క కూడా తీసుకో వచ్చు.కాబట్టి ఈ సులువైన పద్ధతిని మీరు చూసి అనుసరించండి. దీనితో మీరు ఎంతో ఈజీగా తొక్క తీసుకో వచ్చు. వెల్లుల్లి పై తొక్క తీయడానికి చాలా ఓపిక కావాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఓపిక కాదండి మీకు కావాల్సింది ట్రిక్స్. మీరు కనుక ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఎంతో సులువుగా వెల్లుల్లి తొక్క తీసేయొచ్చు.
ALSO READ | Good Health: వర్షాకాలం.. బత్తాయితో బోలెడు లాభాలు..
వైరల్ అవుతున్న వీడియోలో నెయిల్ కట్టర్ తో కొత్త టెక్నిక్ ఉపయోగించి వెల్లుల్లి పొట్టును తీశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కెండల్ షెరెల్లే ముర్రే (@kendall.s.murray) పోస్ట్ చేసిన ఈ వీడియో 54.2 మిలియన్ల వీక్షణలు మరియు 1.2 మిలియన్ లైక్‌లను పొందింది. వెల్లుల్లి పొట్టును చాలా తేలిగ్గా.. త్వరగా తీయడానికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. దీనితో చూసిన ప్రతి ఒక్కరూ అబ్బా ఇంత సింపుల్ ఆ...? అని అనుకుంటున్నారు. షేర్ చేసిన వీడియో ప్రకారం వెల్లుల్లి కట్ చేస్తే ఎవరైనా క్షణాల్లో వెల్లుల్లిని తొక్క తీసేస్తారు.
ముందుగా ఒక వెల్లుల్లిని తీసుకొని దానిని నీటిలో ఉంచారు. తరువాత ముచికను తొలగించారు, ఆ తరువాత నెయిల్ కట్టర్ ఉపయోగించి.. పొట్టు తీశారు. ఇది చాలా తొందరగా .. ఎలాంటి ఇబ్బంది లేకుండా వెల్లుల్లి పొట్టును తీశారు. ఇన్‌స్ట్రాగ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఈ కొత్త టెక్నిక్‌ను గేమ్ ఛేంజర్ గా భావించారు, ఈ పద్దతిని కొంతమంది సంతోషించారు.. మరికొంతమంది వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
ఇది సాధారణ వంట సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను కోరుకునే విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. వంటగది సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా మందికి ప్రాధాన్యతగా మిగిలిపోయినందున, ఇటువంటి పద్ధతులు గృహ వంటల మధ్య దృష్టిని ఆకర్షించడానికి మరియు సంభాషణలను ప్రాంప్ట్ చేయడానికి అవకాశం ఉంది..
పైగా మీకు ఎంతో టైం కూడా సేవ్ అవుతుంది. సాధారణంగా వెల్లుల్లిపాయ ని కట్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ ఒక్క నిమిషం కంటే తక్కువ సమయం లోనే ఈ పద్ధతిని ఉపయోగించి మొత్తం వెల్లుల్లి పాయలు అన్ని కూడా మనం కట్ చేసుకో వచ్చు. ఎంత సింపుల్ గా ఉందంటే చాలా వెంటనే చేసుకోగలిగే అంత సింపుల్ గా ఉంటుంది. . ఎవరైనా ఎంతో సింపుల్ గా కేవలం నెయిల్ కట్టర్ ఉపయోగించి వెల్లుల్లి పొట్టు తీశారు.