నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ముల్కల పల్లి గ్రామంలో మహిళను హత్య చేశారు నలుగురు దుండగులు. ఆగస్టు 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్య చేసుకున్నట్టు రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్ కు స్థానిక ఎస్ ఐ నారాయణరెడ్డి సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ హత్యలో ముగ్గురు నిందితులను తప్పించినందుకు ఎస్ ఐ 6 లక్షల డీల్ కుదిర్చకున్నారు. అయితే మహిళను హత్య చేసినట్టు పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నాడు నిందితుడు రాములు. హత్యకు గురైన మహిళ కుటుంబ సభ్యులకు రూ. 30 లక్షలు ఇచ్చేందుకు గ్రామ పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. అయితే 30 లక్షల రూపాయలు ఇస్తాడో ఇవ్వడో అని ముందస్తుగా నిందితుడు రాములు నుంచి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.