పెద్దపులి దాడిలో మహిళ మృతి

ఆదిలాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చింతలపేట్ లో పెద్దపులి దాడిలో మహిళ మృతిచెందింది. ఖానాపూర్ , మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లా అహేరీ పరిధిలో చింతల్ పేట్ గ్రామంలో ఆదివారం (జనవరి 7) పత్తి తీసేందుకు చేనులోకి వెళ్లిన మహిళపై పెద్ద పులి దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతిచెందిన మహిళ చింతల్ పేట్ కు చెందిన సుష్మా(50) గా గుర్తించారు. సుష్మా గ్రామంలో కిరాణా షాపు నిర్వహిస్తూ కూలి పనులకు వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు.