బస్సు ఆపలేదని.. డ్రైవర్పైకి పాము విసిరిన మహిళ

హైదరాబాద్ సీటీ.. అది విద్యానగర్ బస్టాప్..బస్టాప్ కొద్దీ దూరంలో బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ చేసిన వింత చేష్టలకు డ్రైవర్, కండక్టర్ తో సహా ప్రయా ణికులు భయభ్రాంతులకు గురిచేసింది. బస్సు ఆపనందుకు ఏకంగా బీర్ బాటిల్ తో దాడి చేసింది. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్ పైకి పామును విసిరిన ఘట న  నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ లో గురువారం ఆగస్టు 08, 2024న సాయంత్రం జరిగింది. మద్యం మత్తులో ఉన్న మహిళ చేసిన ఈ వింత చేష్టలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విద్యానగర్ మీదుగా వెళ్తుండంగా బస్టాప్ సమీపంలో  సంచితో ఓ మహిళ బస్సు ఎక్కాలని ప్రయత్నించింది.. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండు ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆగ్రహించిన మహిళ .. బస్సు వెనకనుంచి బీర్ బాటిల్ విసిరింది. దీంతో బస్సు అద్దం పగిలిపోయింది. అంతటితో ఆగకుండా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్ పై ఆమె సంచిలో తెచ్చిన పామును విసిరింది.. దీంతో భయంతో డ్రైవర్, కండక్టర్, బస్సుల్లో ఉన్న ప్రయాణికులంతా పరుగులు పెట్టారు. 

మద్యం మత్తులో ఉన్న మహిళ వింత చేష్టలకు ప్రయాణికులు , స్థానికులు ఆశ్చర్యపోయారు. బస్సు డ్రైవర్, కండక్టర్ .. మహిళను పట్టుకొని నల్లకుంట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. డ్రైవర్ ఫిర్యాదుతో మహిళపై కేసు నమోదు చేశారు నల్లకుంట పోలీసులు.