కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల చేష్టలు, అక్కడ చోటుచేసుకునే వింత పోకడలకు సంబంధించిన వీడియోలు (Viral Video) తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ యువతి మెట్రో రైలులో బెల్లీ డ్యాన్స్ (belly dancing) చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేసింది. వీడియోలోని మహిళ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మనిషా డాన్సర్‌గా గుర్తించారు. ఈ వీడియోని ఆమె అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
ఢిల్లీ మెట్రోకు స్వాగతం..ఈ మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ, మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై ఈ డైలాంగ్ ఎక్కడ విన్నా, చదివినా కూడా దాని వెనుక కోలాహలం సృష్టించే పోస్ట్ శీర్షిక అని మీకు ఇట్టే అర్థమైపోతుంది. దేశ రాజధాని లైఫ్ లైన్ గా చెప్పుకునే మెట్రోలో రోజురోజుకూ వింత పనులు, విచిత్ర డ్యాన్సులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెట్రో నిర్వాహణ యంత్రాంగం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, ఎన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ ఈ ట్రెండ్ ఆగడం లేదు. ఇప్పుడు కూడా కదులుతున్న మెట్రోలో భోజ్‌పురి పాటపై ఓ అమ్మాయి వింత డ్యాన్స్ చేస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. అమ్మాయి రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుండగా, అక్కడ కూర్చున్న వారంతా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ యువతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు సంబంధించి DMRC ఎటువంటి ప్రకటన లేదా చర్య తీసుకోలేదు.
ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. వీడియోలోని మహిళ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మనిషా డాన్సర్‌గా గుర్తించారు.కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
Who needs Bar Dancers when you get Free Dance Shows in Delhi Metro 😂🤦♀️ pic.twitter.com/NYn9aDQvgX
— Rosy (@rose_k01) May 19, 2024