
మౌంట్ మాంగన్వీ: భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి కొత్త రికార్డు సృష్టించింది. మహిళల క్రికెట్లో వన్డేల్లో 250 వికెట్ల తీసిన మొదటి ప్లేయర్ గా 39 ఏళ్ల ఈ స్పీడ్ స్టర్ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ గా మరో ఘనతను అందుకుంది. ఇది భారత క్రికెట్లోనే గాక విమెన్స్ క్రికెట్లో రికార్డుగా చెప్పొచ్చు. వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచులో ఝులన్ ఈ ఫీట్‌ను అందుకుంది. ఇకపోతే, ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 134 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన (35), రిచా ఘోష్ (33) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమవయ్యారు. చార్లీ డీన్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం 2 వికెట్ల కోల్పోయి 59 రన్స్ చేసింది. నైట్ (13 బ్యాటింగ్), సీవర్ (41) క్రీజులో ఉన్నారు.
Milestone ? - 250 wickets in ODIs for @JhulanG10 ??#CWC22 pic.twitter.com/g0f1CqT3Sl
— BCCI Women (@BCCIWomen) March 16, 2022
మరిన్ని వార్తల కోసం: