అంగన్వాడీ టీచర్​కు వుమెన్ అచీవర్స్ అవార్డు

నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ-3 అంగన్వాడీ కేంద్రం టీచర్ ఎన్.పద్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యుత్తమ పురస్కారం అందుకున్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మకు వుమెన్ అచీవర్స్-–2024 అవార్డు ప్రదానం చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ క్రాంతి వెస్లీ పాల్గొని ఈ అవార్డు అందజేశారు. రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్న పద్మను జిల్లా ఐసీడీఎస్ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.