తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి యాగంటి ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. అంతకుముందు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి దర్శనానికి వెళుతుండగా అధికారులు అడ్డుకొనగా.. ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత విశాఖ నాగక్షేత్రం పీఠాధిపతి ఆమెను శరీరంపై ఎర్రటి దుస్తులు ధరించమని చెప్పారు. ఆ తరువాత ఆమె స్వామిని దర్శించుకుని యాగంటికి బయలు వెళ్లారు. అయితే మార్గ మధ్యంలో అలంపూర్ వద్ద కారు మొరాయించడంతో అక్కడే కారును వదిలి కాలినడకన వెళ్లారు. శనివారం ( నవంబర్ 9)న తెల్లవారుజామున యాగంటి ఆలయానికి చేరుకుని ... ఉమామహేశ్వర ఆలయంలో శివుడిని దర్శించుకున్నారు.
యాగంటి ఆలయంలో ఆమె మాట్లాడుతూ .. లోక కళ్యాణం కోసమే తాను దేవాలయాలను సందర్శిస్తున్నానని... సనాతన ధర్మం కోసం తన పోరాటం ఆగదని మహిళా అఘోరీ తెలిపారు. కుంభమేళకు వెళ్లి వచ్చిన తరువాత అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తానని చెప్పారు. యాగంటి క్షేత్రంలో దర్శనం చేసుకున్న తరువాత .. మహిళా అఘోరీ మహానందికి వెళ్లినట్లు సమాచారం అందుతోంది.