- కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వృద్ధాశ్రమ ప్రారంభంలో మంత్రి సీతక్క
జనగామ, వెలుగు : అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని, చివరి రోజుల్లో వృద్ధులను సంతోషంగా ఉంచేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక పెద్దల(వృద్ధ) ఆశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జనగామ జిల్లా కేంద్రం శివారు సిద్ధిపేట రోడ్డు శామీర్ పేట సమీపంలో కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమ ఆమె ప్రారంభించారు.
అనంతరం సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ, రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడారు. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలోనే ఒక మోడల్ గా కార్పొరేట్ కంపెనీ స్థాయిలో వృద్ధాప్య ఆశ్రమాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.