మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘నారి’. ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను రిలీజ్ చేసి సినిమా విజయం సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ ‘మహిళల పట్ల పురుషులు ఎలా వ్యవహరించాలి, వారికి ఎలా సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్‌తో రూపొందించాం. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, సునైన ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.