అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చిందని ఆరోపించారు. రైతు బంధుపై రైతులను కాంగ్రెస్ మరోసారీ మోసం చేసిందని అన్నారు. నర్సాపూర్ రోడ్ షో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్. రైతులు పండించిన వడ్లు కొంటలేరని, 500 బోనస్ బోగస్ అయ్యిందన్నారు. మహిళలను, విద్యార్ధులను కాంగ్రెస్ గోల్ మాల్ చేసిందని విమర్శించారు కేసీఆర్.
మోదీ హాయాంలో పబ్లీక్ సెక్టార్లన్నీ ప్రైవేటు పరమయ్యాయని ఆరోపించారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను కాల్చిచంపిన ఘనత మోదీదన్నారు. మోదీ ఎజెండాలో పేదల గోసలు, రైతుల బాధలుండవని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని ప్రజలు,యువత ఆలోచించి ఓటేయ్యాలన్నారు కేసీఆర్. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40వేల-50వేల మెజారిటీని తీసుకురావాలని కోరుతున్నానన్నారు.