ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయిన మహిళ

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హల్ చల్ చేసింది. కారు వీల్కు లాక్ వేశారంటూ ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది. విధుల్లో ఉన్న వారిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

కాకినాడకు చెందిన దివ్య కోఠి బ్యాంక్ స్ట్రీట్ లో నో పార్కింగ్ ఏరియాలో తన కారు పార్క్ చేసింది. అది గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారు వీల్ కు లాక్ వేశారు. కాసేపటికి కారు వద్దకు వచ్చిన దివ్య వీల్ లాక్ చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కానిస్టేబుల్ చేతిలో ఉన్న  వాకీటాకీని లాక్కుంది. ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దివ్యపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదుచేసిన సుల్తాన్ బజార్ పోలీసులు కారు సీజ్ చేశారు.