నిమిషం ఆలస్యం నిబంధన, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. గ్రూప్ 2 పరీక్షకు దూరమైన బాలింత మహిళ..

నిమిషం ఆలస్యం నిబంధన, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. గ్రూప్ 2 పరీక్షకు దూరమైన బాలింత మహిళ..

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ( డిసెంబర్ 15, 2024 ) గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం, సోమవారం ( డిసెంబర్ 15, 16 ) రెండురోజుల పాటు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1, 368 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షకు అనుమతి లేదన్న నిబంధన ఉన్న నేపథ్యంలో అభ్యర్థులంతా అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే.. కొంతమంది ఆలస్యంగా రావటంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఇదిలా ఉండగా.. జనగామ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం, నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా ఓ బాలింత పరీక్షకు దూరమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

 జనగామ పట్టణంలో పక్క పక్కనే రెండు పరీక్ష కేంద్రాలు ఉండడంతో పొరపాటున అరగంట ముందే మరో సెంటర్ కు వెళ్ళింది ఓ మహిళా అభ్యర్థి. అయితే.. ఆమె వేరే సెంటర్ కి వెళ్లిందన్న విషయం ఇన్విజిలేటర్ ఓఎంఆర్ షీటు, బయోమెట్రిక్ ప్రక్రియ వరకు గురించలేకపోయారు. మహిళా అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించే సమయానికే అరగంట వృధా అయ్యింది. 

Also Read : తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభం

విషయం తెలుసుకున్న వెంటనే పక్కనే ఉన్న అసలు పరీక్ష కేంద్రానికి వెళ్ళింది బాలింత మహిళ. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లినందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక పరీక్షా కేంద్రం నుండి కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది మహిళా అభ్యర్థి. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు