
ప్రస్తుతం మహిళ ఆరోగ్యం గురించి అవగాహన పెరిగింది. కానీ, కొన్ని అపోహలు మాత్రం అలానే ఉండిపోయాయి. ముఖ్యంగా కొన్ని విషయాలను చర్చించడానికి ఇష్టపడట్లేదు. దాని కారణంగా నష్టపోయేది వాళ్లే అయినప్పటికీ సొసైటీలో ఈ పరిస్థితి మారడం లేదు.
విమెన్ హెల్త్‌కు సంబంధించి మెనోపాజ్ అనే అంశం గురించి సుధామూర్తి మాట్లాడుతూ.. ‘‘నేను యుక్త వయసుకు వచ్చాక మా నాన్న నాతో ‘ఇప్పుడు నీ హార్మోన్లు ఎక్కువవుతాయి. దానివల్ల నీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అద్దంలో నీ ముఖాన్ని పదే పదే చూసుకుంటావు. ఒకానొక రోజు ఆ హార్మోన్లు తగ్గిపోతాయి.
మెనోపాజ్ వస్తుంది’ అని అప్పుడే మెనోపాజ్ గురించి నన్ను ప్రిపేర్ చేశారు. అలాగే ఇదేమి జబ్బు కాదు. కానీ, హార్మోన్లు అనేవి ఆగిపోతాయి అని చెప్పారు. ఆయన చెప్పిన విషయం నా మెనోపాజ్ టైంలో గుర్తొచ్చింది. అప్పుడు నేను చాలా కష్టపడి పనిచేయాల్సిన సమయం. ఇదంతా సృష్టిలో జరిగే సాధారణ మార్పు అని నాకు తెలుసు. భయం, కన్ఫ్యూజన్ వంటివి ఎవరైనా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిందే.
అయితే అన్నిసార్లూ ఎమోషనల్ ఛేంజెస్‌ని మేనేజ్ చేయడం సాధ్యం కాదు. ఒకసారి నా పిల్లలు చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. అప్పుడు నేనెంతో ఏడ్చా. తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే.. నా పిల్లలు చదువుకోవడానికి వెళ్లారు. నేను మెనోపాజ్ వల్ల ఎమోషనల్ అయ్యాను అని. నా భర్తతో కూడా మెనోపాజ్ గురించి ఓపెన్‌గా మాట్లాడాను.
ఎప్పుడైనా ఏ కారణం లేకుండా నేను అప్సెట్గా ఉన్నానంటే అది హార్మోన్ రిట్రీట్ వల్లే. దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు అని చెప్పా. ప్రస్తుతం ఈ వయసులో కూడా నేను ఫిజికల్, మెంటల్‌గా యాక్టివ్‌గా ఉండడానికి కారణం రెగ్యులర్‌గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడమే. నా చర్మంపై ఉన్న ముడతల్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తా” అన్నారామె.