పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళలు

పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యేపై మహిళలు తిరగబడ్డారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే రమేష్ బాబుకు మహిళలు షాక్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మేడిపల్లి మండలం కొండాపూర్ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కటాఫ్ తేదీ లేకుండా ఫీఎస్ ఉన్న బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బీడీ కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు మహిళలకు హామీ ఇచ్చారు.