డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రజావాణికి మహిళలు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకు కేటాయించాలంటూ 40 మంది నిరుపేద మహిళలు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తాము గతంలో గుడిసెలు వేసుకొని ఉంటే తమను వెళ్లగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని మహిళలు ఆరోపిస్తున్నారు. కట్టిన తర్వాత తమకే ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  గత కొద్ది రోజుల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఫ్లాట్లపై వారి పేర్లను కూడా రాసుకొని వెళ్లారు. అనంతరం ఆ మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో అప్పట్లో కలెక్టర్ ను సంప్రదించారు. తాజాగా మరోసారి కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మహిళలు ప్రజావాణికి వచ్చారు. నిరుపేదలమైన తాము అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.