పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ..

తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 

తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదొకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 8న) ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై శుక్రవారం (డిసెంబర్ 8న) ఆర్టీసీ విధి విధానాలు రూపొందించారు. ఏయే బస్సుల్లో మహిళలు, చిన్నపిల్లలు, బాలికలు టికెట్లు తీసుకోకుండానే జర్నీ చేయవచ్చో చెప్పారు.   

విధివిధానాలు ఇవే.. 

* జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

* సిటీలో మాత్రం ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ 

* మహిళల వయసుతో సంబంధం లేదు 

* చిన్నారులు, బాలికలకు కూడా ఫ్రీ జర్నీ 

* ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచితం 

* తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చు 

* అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితం 

* ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలి 

* మొదటి వారం రోజులు ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయవచ్చు