వరంగల్ లో మహిళా దొంగలు.. వీళ్ల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు..

వరంగల్ లో మహిళా దొంగలు.. వీళ్ల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు..

మహిళలు అంటే ఏదో సాఫ్ట్ కార్నర్.. ఈ లేడీస్ ను చూస్తే మాత్రం చావకొట్టాలనే కసి వస్తుంది. ఎందుకంటే వీళ్లు చేసే అరాచకాలు అలాంటివి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్ చేసే ఈ మహిళా దొంగలు.. కంట్లో కారం కొట్టి.. మెడలోని బంగారం గొలుసులను ఎత్తుకెళుతున్నారు. వరంగల్ సిటీలోని మిల్స్ కాలనీలో 2023, సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం.. వరసగా రెండు ఘటనలు జరగటంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు బాధితులు, స్థానికులు.

చుడీదార్ ధరించి.. ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారని.. సహజంగా మహిళలు ఎలా అయితే సాధారణ దుస్తులు ధరించి ఉంటారో అలాగే ఉన్నారని.. వాకింగ్, జాగింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. దాడి చేసినట్లు చెబుతున్నారు బాధితులు. కంట్లో కారం కొట్టారని.. ఆ తర్వాత ఒంటిపై నగలు లాక్కెళ్లినట్లు చెబుుతున్నారు. వాళ్లు కచ్చితంగా మహిళలే అని చెబుతున్నారు బాధితులు.

బాధితుల వరస కంప్లయింట్స్ తో పోలీసులు తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక టీం రంగంలోకి దిగింది. ఘటన జరిగిన ప్రదేశంలో.. చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు.