మొదట మానస.. ఇప్పుడు మరొక అమ్మాయి: కిరణ్ రాయల్ పచ్చి మోసగాడు: బాధితురాలు

మొదట మానస.. ఇప్పుడు మరొక అమ్మాయి: కిరణ్ రాయల్ పచ్చి మోసగాడు: బాధితురాలు

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. నిన్నటివరకూ జనసేన నేత ఓ మహిళతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. నేడు సదరు మహిళే మీడియా ముందుకొచ్చింది. జనసేన నేత కిరణ్ రాయల్ తన నుంచి కోట్ల రూపాయాలు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు లక్ష్మి ఆరోపించింది. అందుకు తగిన సాక్ష్యాలను ఎస్పీకి అందజేసింది. తనకు న్యాయం చేయాలని, రావాల్సిన సొమ్ము ఇప్పించాలని ఎస్పీని కోరింది.

ALSO READ | తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ లీలలు.. మహిళ ఆత్మహత్యాయత్నం...

"కష్టాల్లో ఉన్నానని చెప్పి.. కోట్ల రూపాయల డబ్బు, 25 సవర్ల బంగారం తీసుకున్నాడు. రూ.5 లక్షలు మాత్రమే తిరిగిచ్చాడు. పదేళ్లుగా అతనికి అన్నీ నేనే. తిరుగుతున్నకారు, వేసుకుంటున్న బట్టలు, వాడుతున్న సెల్ ఫోన్లు అన్నీ నేను కొనిచ్చినివే. అతడి ప్రతి పైసా నాదే. ఇప్పుడు మరో అమ్మాయికి దగ్గరై నన్ను దూరం పెట్టాడు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపెడతానంటే, జనసేన నేతలతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు.." అని బాధితురాలు వాపోయింది.

2013 నుంచి మా మధ్య రిలేషన్..

"జనసేన వీర మహిళలు ఓట్ ఫర్ కిరణ్ అని ప్రచారం చేయడం బాధాకరం. ఒంటరి మహిళకు న్యాయం చేయండి. కిరణ్ రాయల్ పచ్చి మోసగాడు. 2013 నుంచి మా ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. 2015 నుంచి మా మధ్య సంబంధాలు ముగిశాయని అసత్య ప్రచారం చేస్తున్నాడు. మొదట మానస అనే అమ్మాయిని మోసం చేశాడు. తరువాత నన్ను.. ఇప్పుడు మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు.."

మొదట మానస.. ఇప్పుడు మరొక అమ్మాయి

"తనకు డబ్బులిస్తే లక్ష్మిని వదులుకుంటానని ఆ అమ్మాయితో కిరణ్ చెప్పాడు. అందుకు తగిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత కొంత మంది అతడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకర్థం కావడం లేదు. అతని అవసరం తీరిపోతే వదిలిపోతాడు. నాకు ఇవ్వాల్సి రూ.1.2 కోట్లు ఇప్పించండి. తనకు డబ్బులు ఇవ్వాల్సింది లేదని కిరణ్ రాయల్ కాణిపాకంకు వచ్చి ప్రమాణం చేస్తే.. నేను ఇప్పుడే వదులు కుంటా. చంపుతానని బెదిరిస్తే ఇన్ని రోజులు భయపడి మీడియా ముందుకు రాలేదు. కానీ అత్తగారి ఆస్తులమ్మి కిరణ్ రాయల్‌కు ఇచ్చి మోసపోయా. నాకు ఎవరూ మద్దతు లేదు. నాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ అందర్నీ కోరుతున్నాను. అలాంటి నీచుడ్ని వదిలొద్దు.." అని బాధితురాలు లక్ష్మి ఆరోపించింది.