
ఉత్తరప్రదేశ్లో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరి మహిళల మధ్య వాట్సప్ ఛాటింగ్ కొట్లాటకు దారితీసింది. ఈ వీడియోలో సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అపార్ట్మెంట్ లో నివసించే మహిళలు వాట్సాప్ చాటింగ్.. వాట్సప్ కాల్ విషయంలో వాగ్వాదం జరిగింది. ఇది మరుసటి రోజు వరకు కొనసాగింది.
ఆ ఇద్దరు మహిళలు అపార్ట్మెంట్ గేట్ దగ్గర తారస పడ్డారు. ఇక అంతే ఓ మహిళలో ఆవేశం కట్టలు తెంచుకుంది. జుట్టు పట్టుకొని లాగి కిందపడేసి కొట్టింది. అంతేకాదు.. జుట్టుపట్టుకున్న మహిళ పోలీసులను పిలవండి.. ఆమెకు ఎంత ధైర్యం.. నా తల్లిని తిట్టింది. .. అంటే బిగ్గరగా అరిచింది. ఇంతలో అక్కడున్న వారు ఆ జంటను విడదీసేందుకు ప్రయత్నించారు.
नोएडा के सेक्टर-168 स्थित पारस सीजन सोसायटी के मुख्य गेट पर दो महिलाओं के बीच मचा घमासान। @Uppolice @noidapolice pic.twitter.com/NlYtNnGMiW
— Siddharth Agarwal 🇮🇳 (@siddharth2596) April 12, 2025
ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో ఎక్స్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేస్తూ.. ఈ వీడియో సెక్టార్-168లోని పారాస్ సొసైటీకి చెందినదని రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు ఆ ఇద్దరి మహిళలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | ఈమె ప్యాషన్ తగలెయ్యా..! సిగరెట్లతో శరీరాన్ని కప్పుకుంది..!