రూల్స్​ పాటించని కాలేజీలపై చర్యలుంటయ్: మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ నేరళ్ల శారద

రూల్స్​  పాటించని కాలేజీలపై చర్యలుంటయ్: మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ నేరళ్ల శారద

జీడిమెట్ల, వెలుగు: నిబంధనలు పాటించని కార్పొరేట్​కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మహిళా కమిషన్​చైర్ పర్సన్​నేరళ్ల శారద చెప్పారు. రెండు రోజుల కింద ఇంటర్​ స్టూడెంట్ అనూష ఆత్మహత్య చేసుకున్న బాచుపల్లిలోని కార్పొరేట్ ​కాలేజీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. 

అనూష ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. తోటి విద్యార్థులతో మాట్లాడారు. తనిఖీ టైంలో కొంత మంది సిబ్బంది తీరు సరిగా లేదని చెప్పారు. ఘటన జరిగాక చాలా మంది సిబ్బంది సిక్​లీవ్​పెట్టి వెళ్లడమేమిటని ప్రశ్నించారు. ఇంటర్​విద్యార్థిని ఆత్మహత్యకు  మనమంతా బాధ్యులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక గైడ్​లైన్స్​ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.