వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

  •     14న విచారణకు రావాలని వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు : జ్యోతీష్యుడు వేణుస్వామికి తెలంగాణ రాష్ర్ట మహిళా కమిషన్ ​శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది.ఈ నెల 14న విచారణకు రావాలని ఆయనను ఆదేశించింది. నటుడు నాగచైతన్య, శోభిత పెండ్లి చేసుకుంటే 2027లోనే విడిపోతారని పేర్కొంటూ వేణుస్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

 తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు చేశాయి. దాంతో ఆగస్టులో  వేణుస్వామికి మహిళా కమిషన్ మొదటిసారి నోటీసులు పంపింది. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో వేణుస్వామికి మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. 14న తమ ముందు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.