ఎంఎంటీఎస్​ ట్రైన్​లో అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్​ కార్యదర్శి శారద

ఎంఎంటీఎస్​ ట్రైన్​లో అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్​ కార్యదర్శి శారద
  • ముఖం, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలు
  • గాయాలు మానిన తర్వాత ప్లాస్టిక్​ సర్జరీ
  • ఎంఎంటీఎస్ ​బాధితురాలి ట్రీట్​మెంట్​పై డాక్టర్లు 
  • పరామర్శించిన మహిళా కమిషన్ కార్యదర్శి 
  • విధిలేక రైల్లోంచి దూకానన్న బాధితురాలు 

పద్మారావునగర్, వెలుగు: ఎంఎంటీఎస్​రైల్లో ఓ యువకుడు లైంగికదాడి చేయబోగా దూకి తీవ్రంగా గాయపడిన యువతికి అందిస్తున్న ట్రీట్​మెంట్​వివరాలను డాక్టర్లు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్​చైర్ పర్సన్​నేరెళ్ల శారద ఆదేశాల మేరకు కమిషన్​కార్యదర్శి, సిబ్బంది మంగళవారం సికింద్రాబాద్ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు డాక్టర్లతో మాట్లాడారు. 

ముఖం, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోని ఇతర భాగాల్లో చిన్న గాయాలు అయినట్లు తెలిపారు. ముఖం వాపు తగ్గిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసి గాయాలకు ట్రీట్మెంట్​చేస్తామన్నారు. ప్రస్తుతానికి బాధితురాలు ఐసీయూలో ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఐసీయూలోకి వెళ్లిన కమిషన్​కార్యదర్శి బాధితురాలితో మాట్లాడారు. 

నిందితుడు లైంగిక దాడిచేయబోతున్నట్లు భావించానని, పోలీసులకు, ఫ్యామిలీ మెంబర్స్​కు ఫోన్​ చేద్దామనుకొన్నానని, కానీ, టైమ్​లేకపోవడంతో రైలు నుంచి దూకి తప్పించుకోవాల్సి వచ్చిందని బోరుమంది. బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు కమిషన్​అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కమిషన్​కార్యదర్శి ధైర్యం చెప్పారు.