కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నరా : నేరేళ్ల శారద

కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నరా : నేరేళ్ల శారద
  • మాజీ మంత్రి మల్లారెడ్డిపై మహిళా కమిషన్ చైర్​పర్సన్  శారద ఫైర్

హైదరాబాద్, వెలుగు: పాలు, పూలమ్మిన అని చెప్పుకునే మల్లారెడ్డి.. కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నారా? అని మహిళా కమిషన్  చైర్ పర్సన్  నేరేళ్ల శారద ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇప్పటికే మల్లారెడ్డికి షోకాజ్ నోటీసులు అందించామని, విచారణకు అటెండ్ కావాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలో నేరేళ్ల శారద మీడియాతో మాట్లాడారు.  మాజీ మంత్రిని అని మేనేజ్  చేసే ప్రయత్నం చేయాలని చూస్తే కుదరదని ఆమె హెచ్చరించారు. 

హాస్టల్  బాలికలకు అన్యాయం జరిగితే సహించబోనన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రైవేట్  కాలేజీలకు కొత్త రూల్స్  ఖరారుచేస్తామని తెలిపారు. అలాగే, సీఎంఆర్  కాలేజీని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని వెల్లడించారు. వీడియోల  ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్  అయ్యారని,  ప్రముఖ కాలేజీలలో ఇలా జరుగుతాయా అని ఆశ్చర్యానికి గురయ్యారన్నారు.