కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో రౌడీ షీటర్లు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. సర్వేనెంబర్ 669 / 12లోని 3 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని ఆరోపించింది బాధితురాలు గడప కాంతమ్మ. తన భూమిని అమ్ముకునేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించింది. 20 ఏళ్ల క్రితం సాదా బైనామాపై కొనుక్కున్న స్థలాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రౌడీషీటర్లు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన గుడిసెను కూడా తగలబెట్టారని ఆరోపించింది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని అధికారుల చట్టూ తిరిగినా...ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన గుడిసెను తగులబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది బాధితురాలు కాంతమ్మ.