హద్దులు చూపాలని మహిళల ఆందోళన

మల్యాల, వెలుగు: 2004లో ప్రభుత్వం తమకు కేటాయించిన నివాస స్థలాలకు హద్దులు చూపించాలని మల్యాల తహసీల్ ​ఆఫీస్​ ఎదుట మండలకేంద్రానికి చెందిన మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన నివాస పట్టాలకు హద్దులు చూయించాలని కోరగా తహసీల్దార్ తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. పట్టా పేపర్లు చూపగా తమపై చిందులు వేశారని, అవన్నీ దొంగ పట్టాలన్నారని ఆరోపించారు. కాంగ్రెస్​లీడర్లు దారం ఆదిరెడ్డి, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, వంశీ మహిళలకు మద్దతుగా నిలిచారు.