ఏపీలో దారుణం జరిగింది.. విజయవాడలో మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. విజయవాడలోని మాచవరంలో సోమవారం ( అక్టోబర్ 14, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవాని సోమవారం రాత్రి నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుంది. భవాని ఆత్మహత్యకు కారణం సీఐ ప్రకాష్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం ( అక్టోబర్ 14, 2024 ) రోల్ కాల్ లో సీఐ ప్రకాష్ భవాని పట్ల అసభ్యంగా దుర్భాషలాడాడని.. దీంతో మనస్తాపం చెందిన భవాని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.