కరీంనగర్ టౌన్,వెలుగు: సిటీలోని రెనె హాస్పిటల్ లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళాదినోత్సవం పురస్కరించుకుని రెనె హాస్పిటల్‌లో నిర్వహించిన వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి మేకల అరుణతో కలిసి చైర్మన్ డా. బంగారు స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి అరుణ మాట్లాడుతూ.. ప్రతి మహిళ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని అన్నారు.
నేటి సమాజంలో వివాహ వ్యవస్థ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యుక్తవయస్సులో ఎలాంటి ఆకర్షణలకు గురి కాకుండా సరైన జీవన మార్గాన్ని అనుసరించడం ఎంతో అవసరమన్నారు. అనంతరం పలు విభాగాల్లో పనిచేస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో ఎండి డా. రజని ప్రియదర్శిని డా. హరిత, రజిత, కెప్టెన్ డా.బుర్ర మధుసూధన్ రెడ్డి, పాల్గొన్నారు