సంబురంగా మహిళా దినోత్సవం

  •     మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహబూబాబాద్,  వెలుగు:  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్​ హల్లో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం   సందర్భంగా మహిళ శిశు సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.   

మహిళలు పనిచేసే ప్రతిచోట స్వేచ్ఛ, సమానత్వం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్  మాట్లాడారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు,అడిషనల్​ కలెక్టర్​  లెనిన్ వత్సల్ టొప్పొ, సిడబ్ల్యూసి చైర్మన్ నాగవాణి, మున్సిపల్ చైర్మన్​ పి. రామ్మోహన్ రెడ్డి ,జడ్పీ సీఈవో రమాదేవి, డిడబ్ల్యూవో వరలక్ష్మి  తదితరులు పాల్గోన్నారు. 
 

ములుగు :   అనేక రంగాల్లో మహిళలు తమ శక్తిని నిరూపిస్తున్నారని ,   మహిళగా ప్రతి ఒక్కరు  గర్వపడాలని  కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.  గురువారం కలెక్టరేట్​ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అడిషనల్​ కలెక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్​ ప్రారంభించారు.  మహిళలు నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా  ఆత్మస్థైర్యంతో   ముందుకు సాగాలని అన్నారు.  అనంతరం కలెక్టరేట్  ఆవరణలో  ఫుడ్ స్టాల్స్​ను  సందర్శించారు.  

ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిన్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత, ఇతర అధికారులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.