తాగడానికి నీళ్లు లేవు..ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  ఖాళీ బిందెలతో  నిరసన తెలిపారు. తాగునీరు లేక అల్లాడిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో  5 నెలలుగా తాగునీటి కోసం 30 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గురించి స్థానిక అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.