సంగారెడ్డి మండలంలో తాగునీటి కోసం మహిళల ధర్నా

కంది, వెలుగు : తాగునీరు రావడం లేదని  సంగారెడ్డి మండలం కులబ్​గూర్​పంచాయతీ పరిధిలోని గంజిగూడానికి చెందిన మహిళలు రోడ్డెక్కారు. శుక్రవారం ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. అనంతరం పలువురు మహిళలు మాట్లాడుతూ..  గ్రామానికి ఆనుకొని మంజీరా నది ఉన్నా తమకు తాగడానికి గుక్కెడు నీళ్లు రావడం లేదన్నారు.

ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.