బిందెలతో మిషన్​భగీరథ డీఈ ఆఫీసు ఎదుట మహిళల ధర్నా

భద్రాచలం, వెలుగు :పట్టణంలోని ఇందిరానగర కాలనీకి చెందిన మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో మిషన్​భగీరథ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మిషన్​భగీరథ పైపులు ఉన్నా కేవలం మూడు బిందెల కంటే ఎక్కువగా నీళ్ల రావడం లేదని వాపోయారు.

ఫిర్యాదు చేస్తే ఒక్క రోజు మాత్రమే సక్రమంగా నీళ్లు ఇచ్చారని తెలిపారు.చేతిపంపు ఉన్నా అది కూడా పనిచేయడం లేదని, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవట్లేదని, తాగునీటి ఎద్దడిని నివారించాలంటూ నినాదాలు చేశారు. డీఈ శ్రీనివాస్​ మహిళలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.