తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెంలో తాగు నీళ్ల కోసం గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఎస్టీ కాలనీలో వారం రోజుల నుంచి నీళ్లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వారు గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బిందెలు పెట్టి నిరసన తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. సమస్యను 24 గంటలలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.