పిల్లలు పుట్టి నెల రోజుల్లోనే చనిపోతున్నారని.. మనోవేదనతో మహిళ ఆత్మహత్య

పిల్లలు పుట్టి నెల రోజుల్లోనే చనిపోతున్నారని.. మనోవేదనతో మహిళ ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: ఓ వైపు పిల్లలు పుట్టి నెలరోజుల్లోనే చనిపోతున్నారే బాధ.. మరోవైపు భర్త తాగుడుకు బానిసయ్యాడనే ఆవేదనతో ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. 

పేట్​బషీరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. సుభాష్​నగర్​కు చెందిన కోదండ రామ్, దేవి (28)కి 2015లో పెండ్లి జరిగింది. 9 ఏండ్ల కాలంలో దేవికి రెండుసార్లు  పిల్లలు పుట్టి నెలరోజుల వ్యవధిలోనే చనిపోయారు. దీంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బాధను తట్టుకోలేక భర్త మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి దేవి తన ఇంట్లో ఉరేసుకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.