Women Beauty : మీ ముఖాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి.. లేదంటే ఉన్న అందం పోతుంది.. ఆ టిప్స్ మీ కోసం..!

ఫేస్ బ్యూటీ కోసం జనాలు తహతహలాడుతుంటారు.  కాని ముఖంపై పెట్టుకొనే బొట్టుతో చాలా అందంగా కనపడతారు.  అయితే ఒక్కో రకమైన షేప్ ఫేస్ కు ఒక్కో రకంగా బొట్టు పెట్టుకుంటే అందం అదిరిపోతుంది.  ఇప్పుడు ఆ వివరాలు మీకోసం. . .

ఒకప్పడు నుదుటి మీద అంటే  కుంకుమ తప్ప వేరే ఏదీ కనిపించేది. కాదు. కానీ, మారుతున్న ట్రెండ్స్ ని బట్టి ఇప్పుడు రకరకాల బొట్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రెస్సు రంగును బట్టి బిందీని ( స్టిక్కర్)  పెట్టుకోవడం ఫ్యాషన్ గా మారింది. అలాగని ఫ్యాషన్ అనుకుని వచ్చిన బిందీని నుదిటికి స్టిక్ చేస్తే ఉన్న అందం కూడా పోతుంది. అలాకాకుండా ఉండాలంటే ముఖాకృతిని బట్టి బొట్టుని ఎంచుకోవాలి...

హార్ట్ షేప్ ఫేస్

నుదురు, బుగ్గలు ఎక్కువగా ఉండి గడ్డం చిన్నగా అచ్చం హార్ట్ షేప్ ఫేస్ గలవాళ్లు పెద్ద పెద్ద బొట్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ముఖం అల్ రెడీ పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి పెద్ద బొట్టు అస్సలు సూట్ అవ్వదు. చిన్న చిన్న బొట్టుబిళ్లలు, కుంకుమ బొట్టు ఈ ముఖాకృతి వాళ్లకి బాగా నప్పుతాయి. పైగా ఈ బొట్టుని కూడా కనుబొమ్మలకు మధ్యన కాకుండా కాస్త కిందకు పెడితే మరింత బాగుంటారు.

స్క్వేర్ షేప్ ఫేస్

స్క్వేర్ షేప్ ముఖాకృతి గల వాళ్లకి అర్థ చంద్రాకారం. V షేప్ తో ఉండే బొట్లు బాగా నప్పుతాయి. నుదుటి పై చంద్రవంకను పెట్టి... కింద ఒక అడ్డగీత గీసి చిన్న చిన్న చుక్కలతో బొట్టుని అందంగా అలంకరిస్తే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. బటర్ ఫ్లై షేప్ ఉన్నవి కూడా బాగుంటాయి.

ALSO READ | Good Health : హాయిగా నవ్వండి.. నవ్వుతూ ఉండండి.. మతిమరుపును మాయం చేసుకోండి.. నమ్మటం లేదా.. ఇది నిజం..!

ట్రైయాంగిల్

ఈ షేప్ షేప్ ఉన్నవాళ్లకి నుదురు చిన్నగా ఉంటుంది. మరికొందరికి రివర్స్ త్రిభుజాకారంలో ఉండి... నుదురు  పెద్దగా ఉంటుంది. ఇలా ఏ త్రిభుజమైనా కూడా ఎలాంటి రకాల బొట్లనైనా వీళ్లు ట్రై చేయొచ్చు. బొట్టుతో ప్రయోగాలు చేయాలంటే మాత్రం ఈ షేప్ షేప్ వాళ్లు బెస్ట్. పెద్దవి, చిన్నవి, మెరిసేవి. మెరవనివి అని కాకుండా కుంకుమతో బొట్టు పెట్టినా ముఖం మెరిసిపోతుంది.

గుండ్రటి ముఖం

గుండ్రటి ముఖం ఉన్నవాళ్లు కాస్త బ్యాలెన్స్ లుక్ ని మెయింటెన్ చేయాలి. ఎక్కువగా... నిలువు బొట్లను పెడితే మరింత అందంగా కనిపిస్తారు. ఒకవేళ గుండ్రటి బొట్టు పెట్టుకోవాలనుకుంటే మాత్రం చిన్నది పెట్టుకొని చూడండి. పెట్టే బొట్టు నిలువుగా పెట్టినా.. వాటిలో డిఫరెంట్ డిజైన్లు ట్రై చేస్తే బెటర్. విద్యాబాలన్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యారాయ్ లాంటి వాళ్లు ఈ గుండ్రటి ముఖం గలవాళ్లే వాళ్ల బిందీ స్టెల్ స్టైల్ ఫాలో అయిపోతే చాలు. మేకప్ మామూలుగా వేసి ముఖాన్ని బొట్టుతో హైలైట్ చేస్తే అందంగా కనిపిస్తారు

ఓవెల్ షేప్

వీళ్లకి సుదురు... బుగ్గలు ఒకే మాదిరిగా సమాంతరంగా కనిపిస్తాయి. వీళ్లకి ఎలాంటి బొట్టెనా పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కాకపోతే మరీ పాపిడను తాకేలా పొడవైన బొట్లను పెట్టకపోవడమే మంచిది. మాధురీ దీక్షిత్, సోనమ్ లాంటి వాళ్లు ఈ షేప్ ఫేసున్న వాళ్ళే ఇంకో విషయం.. లిప్ కలర్ కి, బొట్లు రంగుకి మ్యాచింగ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే కింద చిన్న కుంకుమ బొట్టు పెడితే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది

-వెలుగు, లైఫ్-