
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్, మహిళా జన్ సున్వాయి పేరుతో జాతీయ మహిళా కమిషన్ .. మహిళల సమస్యలపై సోమవారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రజావాణి నిర్వహించనుంది.
ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు సమాగమం హాల్, 2వ అంతస్తు లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ అక్కేశ్వరరావు తెలిపారు. ఎవరైనా మహిళలు తమ ఫిర్యాదులను జాతీయ మహిళా కమిషర్కు సమర్పించవచ్చని ఆయన తెలిపారు.