కీసర, వెలుగు: చీర్యాలలోని నాటకం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన స్టూడెంట్లలో మరో ఇద్దరి డెడ్‌బాడీలు గురువారం దొరికాయి. బుధవారమే ఒకరి డెడ్‌బాడీ దొరకగా.. గురువారం ఉబేద్, బాలజీ బాడీలను డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలు గుర్తించాయి. ఘటనా స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి , మేడ్చల్అడిషనల్కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పరిశీలించారు. స్టూడెంట్ల తల్లిదండ్రులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
దుర్గం చెరువులో యువతి..
మాదాపూర్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులో దూకిన యువతి డెడ్‌బాడీని గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి చెందిన స్వప్న డిప్రెషన్‌తో బాధపడుతూ బుధవారం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.